Saturday, May 18, 2024
- Advertisement -

ఆల‌స్యానికి నిండు ప్రాణం బ‌లి…

- Advertisement -

ఆలస్యం కారణంగా పరీక్షకు అనుమతించకపోవడంతో సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘ‌ట‌న దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. మృతుడిని క‌ర్నాట‌కకు చెందిన‌ వరుణ్ (28)గా గుర్తించారు.

ఆదివారం జరిగిన యూపీఎస్సీ పరీక్షకు కొద్దిగా అలస్యంగా చేరుకోవడంతో వరుణ్‌ను అధికారులు లోనికి అనుమతించలేదు. దీంతో అతడు నిరాశగా వెనుదిరిగాడు. చాలా కాలంగా సివిల్స్‌కు సన్నద్ధమవుతూ.. చిన్న నిర్లక్ష్యం కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోవడంతో వరుణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి అతడు నివాసం ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ లేఖను కూడా రాసిపెట్టాడు.

నిబంధనలు మంచివే.. కానీ, కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల ఇబ్బందులను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి’ అని వరుణ్ తన సూసైడ్ నోట్‌లో రాసిపెట్టిన‌ట్లు పోలీస్ అధికారి వెల్ల‌డించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టమ్‌ అనంతరం వరుణ్‌ మృతదేహాన్ని ఢిల్లీలో ఉంటున్న అతని సోదరికి అందజేశామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -