జగన్, చంద్రబాబును.. కలుపుతున్న మోడీ !

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ మద్య ఉన్న రాజకీయ వైరం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసర లేదు. ఎలాంటి సందర్భం ఏదైనా, పరిస్థితి ఎలాంటిదైన ఈ రెండు పార్టీలు ఉప్పు, నిప్పు లాగా ఎప్పుడు విభేధిస్తూనే ఉంటాయి. ఏక సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ జగన్ మరియు వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోతే.. మరో సంధర్భంలో వైసీపీ అధినేతపై చంద్రబాబు మరియు టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండి పడుతూ ఉంటారు. ఆ విధంగా ఈ రెండు పార్టీల మద్య వున్న వైరం దేశ వ్యాప్తంగా ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. మరి ఇంతటి రాజకీయ వైరం ఉన్న ఈ రెండు పార్టీల అధినేతలను ఒకే వేధికపై చూస్తామా ? అంటే కలలో కూడా జరగని పని.. అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు.

కానీ టీడీపీ, వైసీపీ అధినేతలు అయిన చంద్రబాబు, వైఎస్ జగన్ ఒకే వేధికపై కనిపించే అవకాశం ప్రధాని నరేంద్ర మోడి కల్పించారు. ఈ నెల 6వ తేదీన డిల్లీలో జరగబోతున్న ” ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ” జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపీ సి‌ఎం జగన్, మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు కు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఈ ఇద్దరినీ ఒకే వేధికపై చూసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ఈ జాతీయ సమావేశాలకు హాజరవుతారా ? అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇటీవల ఏపీ సి‌ఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు కేంద్రంపై తరచూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ జాతీయ సమావేశాలకు హాజరవుతారా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. మరోవైపు కేంద్రాని మొన్నటి వరకు దూరంగా ఉన్న చంద్రబాబు.. రాష్ట్రపతి ఎన్నికలు మొదలుకొని కేంద్రానికి ఏదో ఒక రకంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ జాతీయ సవేశాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి దేశానికి సంభంధించిన కార్యక్రమం కావడంతో వైస్ జగన్, చంద్రబాబు ఒకే వేధికపై కనిపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read

ఆ సర్వే ఫలితాలు జగన్ కు హెచ్చరికే ?

ఆ విషయంలో.. మాట తప్పిన మోడీ !

దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -