Saturday, May 18, 2024
- Advertisement -

గుండె పోటుతో బాల‌సాయిబాబా క‌న్నుమూత‌..శోక సంద్రంలో భ‌క్తులు

- Advertisement -

కర్నూలు జిల్లాకు చెందిన బాలసాయిబాబా కన్నుమూశారు. గుండెపోటుతో బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో భ‌క్తులు శోక సంద్రంలో మినిగిపోయారు. బాల సాయిబాబాకు కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగానూ, విదేశాల్లోనూ అనేకమంది భక్తులున్నారు.

శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ పేరు తెచ్చుకున్న బాలసాయిబాబాపై అనేక అరోపణలు ఉన్నాయి. గుప్త నిధుల తవ్వకాలు, భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, తనదైన ప్రవచనాలతో భక్తులను ఆయన విశేషంగా ఆకట్టుకునేవారు. బాలసాయి మృతి వార్త విని ఆయన అనుచరులు కంటతడి పెట్టారు.

1960 జనవరి 14న కర్నూలులో జన్మించిన బాలసాయి, చిన్నతనం నుంచే శ్రీ రమణ మహర్షి బోధనలతో ఆథ్యాత్మికత వైపు మళ్లినట్టు చెబుతుంటారు. మెడిసిన్, ఫిలాసఫీ విద్యలు అభ్యసించిన ఆయనకు నృత్య, గాత్ర కళల్లోనూ ప్రావీణ్యం ఉంది. తన 18వ ఏట ఆశ్రమాన్ని స్థాపించిన ఆయన బోధనల పట్ల ఎంతో మంది ఆకర్షుతులయ్యారు.

కర్నూలు ప్రాంతంలో పాఠశాలలు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించడంలో నిధులిచ్చిన ఆయనకు డాక్టర్ ఆఫ్ డివైనిటీ (ఇటలీలోని గ్లోబల్ ఓపెన్ యూనివర్శిటీ), అంబాసిడర్ ఆఫ్ పీస్ (ఐరాస), ఆననరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లాస్ (నెదర్లాండ్స్ గ్లోబల్ పీస్ వర్శిటీ), ఆనరరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఫ్రాన్స్, యూనివర్శిటీ ఆఫ్ లిబ్రీ డెస్ సైన్స్) గౌరవాలు దక్కాయి. రాయ్ పూర్ లోని కళింగ యూనివర్శిటీకి బాలసాయి వైస్ చాన్స్ లర్ గానూ విధులు నిర్వర్తించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -