Saturday, April 27, 2024
- Advertisement -

ఆకస్మిక గుండె సమస్యలకు కారణాలేంటి?

- Advertisement -

మానవ శరీరంలో ఏ ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకపోయినా.. మనం అనారోగ్యాలపాలవ్వడం ఖాయం. ఆధునికత పెరిగిపోతున్న.. సాంకేతికత వృద్ధి చెందుతున్న.. మనిషి ప్రాణాలకు భరోసా లేకుండా పోతున్నది. గుండె ఎంత పదిలంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. వయసుతో సంబంధం లేకుండా ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. గత కొంతకాలంగా ఆకస్మిక గుండెపోట్లు గణనీయంగా నమోదవుతున్నాయి.

అందుకే గుండె ఆరోగ్యంగా ఉండాలంటూ డాక్టర్లు సలహాలు సూచనలు ఇస్తుంటారు. ముఖ్యంగా ఈ కింది మూడు సమస్యలు కనుక ఉండే ఖచ్చితంగా మీకు గుండె జబ్బులు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరి ఆ మూడు సమస్యలు ఏంటంటే..

Also Read: చెమ‌ట బాగా ప‌డుతుందా..? అయితే ఇలా చేయండి..!

ఒకటి మీరు ఒత్తిడికి గురవడం.. రెండు మీ బాడీలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండటం.. మూడు హైబీపీతో మీరు బాధపడటం.. ఈ మూడు సమస్యలతో మీరు బాధపడితే.. భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడం జరుగుతుందట. అమెరికన్ కాలీజ్ ఆఫ్ కార్డియాలజీకి శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు.

గుండెకు జబ్బులు కలిగున్న 36 వేల మందిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. యవ్వనంలో వచ్చే హైబీపీ, ఒత్తిడి, కొలెస్ట్రాల్ సమస్యలను ఆ వయస్సులోనే నియంత్రించలేని వారికే 64 శాతం వరకు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు వెళ్లడించారు. పైన చెప్పిన మూడు సమస్యలను అధిగమించినప్పుడే గుండె జబ్బులు దరిచేరవని సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -