Monday, April 29, 2024
- Advertisement -

ఈ జాగ్రత్తలతో గుండెపోటుకు చెక్!

- Advertisement -

గుండె పోటు…ఈ మాట వింటేనే అందరికి వణుకు పడుతోంది. వయసుతో సంబంధం లేకుండా నేటికాలంలో హార్ట్ ఎటాక్‌తో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచం ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 17.9 మిలియన్ మంది చనిపోతున్నారని అంచనా. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైలే.

గుండెపోటు రావడానికి ప్రధాన కారణం..గుండెకు రక్తాన్ని తీసుకెల్లే రక్త నాళాల్లో చెడు కొవ్వు పెరుకుపోవడమే. దీంతో గుండెకు తగినంతా రక్త సరఫరా జరగక ,ఆక్సిజన్ అందక గుండె నొప్పికి కారణమవుతోంది. ఇది తీవ్రమైతే మనిషి చనిపోవడం ఖాయం.

అయితే కొన్ని లక్షణాలతో హార్ట్ ఎటాక్ సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. గుండె దగ్గర మంటగా అనిపించడం, ఛాతీ వెనకాల, దవడ దగ్గర, గొంతులో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు గుండుపోటుకు ముందు వచ్చేవే. అలాఏగ తీవ్రంగా చమటలు పట్టడం, కడుపులో అసౌకర్యంగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడాన్ని గమనించి డాక్టర్లను సంప్రదిస్తే ఈ సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు. అలాగే ధూమపానాన్ని మానేయడం, జంక్ ఫుడ్ కంట్రోల్ చేయడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చు.

అలాగే ప్రతిరోజూ వ్యాయామం, మానసిక ఒత్తిడిని అధిగమించడం, తగినత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒమేగా ఫాటియాసిడ్స్ ఉండే ఆహారం, ఆకు కూరలు తినడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -