Saturday, May 18, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియే….

- Advertisement -
10 feet long king cobra pulled out from a car

పది అడుగుల పొడవు. 4.6 కిలోల బరువుతో ఉన్న ఓ నల్లటి కింగ్ కోబ్రా (నాగు పాము) చైనాలో హడలెత్తించింది. ఓ కారు ఇంజిన్ భాగంలోకి దూరి భయపెట్టింది. దాన్ని బయటకు తీసేందుకు ముగ్గురు వ్యక్తులు ఎంతో శ్రమ పడ్డారు.

చివరికి దాన్ని తీసుకెళ్లి అడవుల్లో విడిచి పెట్టారు. చైనాలోని యున్నన్ ప్రావిన్స్ ప్రాంతంలో జరిగిన దీన్ని ఓ వీడియోలో బంధించి అంతర్జాలంలో పోస్ట్ చేయ‌డంతో ఇది వైర‌ల్‌గా మారింది.

{loadmodule mod_custom,GA1}

ఏంచక్కా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళదామనుకున్న యజమానికి పెద్ద షాక్‌ ఎదురైంది. కారు ఇంజిన్‌ను చెక్‌ చేద్దామనుకున్న ఆ వ్యక్తికి ఓ పదడుగుల భారీ కింగ్‌ కోబ్రా దర్శనం ఇచ్చింది. దీంతో ఇంకేముంది ఆ వ్యక్తి ఎగిరిపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నలుగురు పోలీసులు అక్కడికొచ్చి ఆ పామును బయటకు తీసేందుకు నానా తంటలు పడ్డారు.
పామును పట్టే స్టిక్‌లతో కారు వద్దకు చేరుకుని మూడు మీటర్లు పొడవుండి దాదాపు ఐదు కేజీల బరువున్న పామును ఎట్టకేలకు బంధించారు. దానిని చూసిన అక్కడి వారంతా బెదిరిపోయారు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -