Sunday, May 19, 2024
- Advertisement -

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల పండుగ

- Advertisement -

తెలంగాణలో టిఆర్ఎస్ నాయకుల పంట పండింది. రెండేళ్లుగా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల పందారానికి శ్రీకారం చుట్టింది కెసిఆర్ ప్రభుత్వం. ముందుగా మార్కెట్ కమిటీలకు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి మంత్రి హరీష్ రావు పదవుల పందారాన్ని మీడియాకు విడుదల చేశారు.

ముందుగా పది మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించారు. దేశంలోనే తొలిసారిగా మార్కెట్ కమిటీ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. ఒంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బాల్య స్నేహితుడు జహంగీర్ నియమించారు.

అలాగే కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపి బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ ను నియమించారు. బిర్కూర్ కమిటీ చైర్మన్ గా పెరిక శ్రీనివాస్ ను నియమించారు. పది మార్కెట్ కమిటీల్లో ఒకచోట మహిళ లక్ష్మికి అవకాశం కల్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -