Saturday, May 18, 2024
- Advertisement -

నిన్న సింహాలు…ఇప్పుడు జింక‌లు

- Advertisement -

సింహాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న గిర్ అర‌ణ్య‌లో ఇటీవ‌ల సింహాలు అకాస్మాత్తుగా మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. మూడు వారాల స‌మ‌యంలో 23 మృగ‌రాజులు చ‌నిపోవ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. అది మ‌ర‌వ‌క ముందే తమిళనాడు తిరుచిరాపల్లిలోని పార్కులో 31 జికంలు అనారోగ్యానికి గురై చ‌నిపోయాయి.

జింక‌లు తీసుకున్న ఆహారం విషంగా మారి ప్రాణాలు కోల్పోయాయ‌ని అధికారులు తెలిపారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సబాబుల్ చెట్ల ఆకులను జింకలు ఎక్కువగా తిన్నాయి. ఆ ఆకుల్లో అధికంగా ఉండే టాక్సిక్ యాసిడ్‌ మోతాదు వల్ల ఆహారం జీర్ణం చేసుకోలేక మూగ జీవాలు చనిపోయాయని ప్రాథమికంగా అంచనా వేశారు ఫారెస్ట్ అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -