Thursday, April 25, 2024
- Advertisement -

‘మహేశ్’ను కొల్లగొట్టింది .. కూకట్ పల్లి నుంచే..

- Advertisement -

నగరంలోని మహేష్ బ్యాంకు సర్వర్ ను హ్యాక్ చేసి రూ. 12 కోట్లను దారి మళ్లించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈవ్యవహారంలో నైజీరియన్లు , ఆంధ్రప్రదేశ్ తో పాటు చెన్నైకి చెందిన కొందరు మధ్య వర్తులుగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు.

బ్యాంకు హ్యాకింగ్, నగదు బదిలీ కూకట్ పల్లిలోని కెపిహెచ్ బి కేంద్రంగా జరిగాయని ఆధారాలు సేకరించారు. ఉత్తర ప్రదేశ్ చెదిన లక్కీ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. బ్యాంకు నుంచి నగదును కాజేయాలని చూసిన నైజీరియన్లు ఇందుకు లక్కీని ఎంచుకున్నారు.

లక్కీకి తెలంగాణ, ఆంధ్రపదేశ్ కు చెందిన చాలామంది బ్రోకర్లతో సంబంధాలు ఉన్నాయి. వీరి సాయంలో బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లను హ్యాకర్లు వాడుకున్నారు. తమకు విదేశీ నిధులు వస్తాయని తమ ఖాతాను వాడుకుంటే 30 శాతం కమిషన్ ఇస్తామని నైజీరియన్లు ఆశ చూపారు. ఇలా ఖాతాలను వాడుకొని బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి రూ.12 కోట్లను కొల్లగొట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -