Sunday, May 5, 2024
- Advertisement -

ఆత్మాహుతి పేలుల్లతో దద్దరిల్లిన ఆప్ఘన్…. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ బాంబు పేలుల్లతో దద్దరిల్లింది. కొద్ది రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగ నున్న నేపథ్యంలో ఆత్మాహుతి దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎన్నికల ర్యాలీ జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో సుమారు 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడ అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అక్కడే ఉన్నట్లు సమాచారం.ఈ బాంబు ప్రేలుడు ఘటన నుంచి ఘనీ తప్పించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

మృతి చెందిన వారిలో అత్యధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. అష్రఫ్ ఘనీ సభకు జనం భారీగా తరలి రావడంతో ఓ ఆత్మాహుతీ సభ్యుడు తనను తాను పేల్చుకున్నట్టుగా స్ధానిక అధికారులు తెలిపారు. అయితే ర్యాలీ జరుగుతున్నప్పుడు మోటార్ సైకిల్‌పై వచ్చిన ఆత్మహుతి దళ సభ్యుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -