Saturday, May 18, 2024
- Advertisement -

డ్రగ్స్ విషంలో సీక్రెట్స్ కనిపెడుతున్న అకున్ స‌బ‌ర్వాల్

- Advertisement -

వారంద‌రి విచార‌ణ‌కూ ఇదే ప‌ద్ధ‌తిని అవ‌లంబిస్తారు. ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం ఏ రెంజ్ లో జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ దందాలో సినీ ప్రముఖల హస్తం ఉందని పసిగట్టి.. నోటిసులు జారీ చేశారు సిట్. ఇప్పటికే ఈ విచారణకు సంబంధించి ముగ్గురి విచారణ పూర్తి అయింది. విచారణకు హాజరవుతున్న వారి నుంచి పూర్తి సమాచారంను రాబడుతున్నారు అకున్ స‌బ‌ర్వాల్.

అలానే ఈ డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో కూడా తెలిసిందని చెప్పారు. డ్రగ్స్ వాడుతున్న స్కూలు పిల్ల‌లంద‌రి పేర్ల‌ను లీక్ చేయడం ఇష్టం లేదని.. కాకపోతే విచారణం మాత్రం కొనసాగుతుందని తెలిపారు. తమ వద్ద విచారణ జరిగిపిన వీడియోలు ఉన్నాయని.. అందరం కలిసి డ్రగ్స్ ముఠా మీద యుద్ధం చేస్తున్నామని తెలిపారు. హైదరబాద్ ను సేఫ్ అండ్ క్లీన్ సిటిగా మారుస్తామని తెలిపారు. అయితే అకున్ వేసే ప్రతి అడుగు సిట్ అధికారులకు అర్ధం కావటం లేదట. విచారణలో ఏ ప్రశ్నలు అడిగామనే ప్రశ్నలు ఎక్కడ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీస్తుంటున్నారట అకున్ స‌బ‌ర్వాల్. సిట్ బృందంలోని సభ్యుల్ని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు.

ఒక్క‌ రోజులో జరిగే ఇంటరాగేషన్‌ను రెండు, మూడు సెషన్స్‌గా విభజించి ముందుకెళుతున్నారు. ఒక్కో సెషన్ లో ప్రశ్నించే బాధ్యతను ఒక్కో టీంకి అప్పగిస్తున్నారు. ఏ బృందంలో ఏ అధికారి ఉంటారో చివరి నిమిషం వరకు ఎవ్వ‌రికీ తెలియదు. ఇందుకుగానూ 25 మంది అధికారుల‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ జర్పాల్సిన టైంకు ముందు అకున్‌ సభర్వాల్.. అధికారులతో చ‌ర్చిస్తున్నారు. విచారణ ముగిసిన తర్వాత అధికారులు విచారణకు సంబంధించిన ఫైల్ ని స‌బ‌ర్వాల్ కు ఇచ్చి వెళ్తున్నారు. ఇంకా నోటిసులు అందుకున్న వారిని విచారించాల్సి ఉంది. వారినీ కూడా ఇదే స్థాయిలో విచారిస్తారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -