దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే మద్య ప్రదేశ్, ఢిల్లీలో లాక్ డౌన్ అమలు అవుతుంది. బీహార్ కూడా ఇదే బాటలో నడిచే యోచనలు ఉన్నట్లు సమాచారం. తాజాగా లాక్ డౌన్ విధించిన రాష్ట్రాల జాబితాలో మరో రాష్ట్రం చేరింది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో గోవా కూడా లాక్ డౌన్ విధించింది.
ఈ మేరకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ రోజు మధ్యాహ్నం లాక్ డౌన్ పై ప్రకటన చేశారు. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని, మే 3 దాకా ఐదు రోజులపాటు కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.
కాసినోలు, హోటళ్లు, పబ్ లనూ పూర్తిగా మూసేస్తున్నట్టు వెల్లడించారు. లాక్ డౌన్ కాలంలో కేవలం అత్యవసర, నిత్యవసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా, గోవాలో రోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 31 మంది చనిపోగా, 2,110 మంది మహమ్మారి బారిన పడ్డారు.
దయచేసి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవొద్దు.. సోదరిగా కోరుతున్న : షర్మిల
మెగా హీరో రామ్ చరణ్ వదులుకున్న హిట్ సినిమాలు ఏంటో తెలుసా?
ఆ బిగ్ బాస్ ‘కంటెస్టెంట్’పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. కారణం?