Friday, May 17, 2024
- Advertisement -

ఎయిర్‌ ఏషియా కేసులో సంచలన విషయాలు

- Advertisement -

దేశ వ్యాప్తంగా ఎయిర్ ఆసియా కేసు సంచ‌ల‌నంగా మారింది. అంత‌ర్జాతీయ విమాన‌యానానికి కావాల‌సిన ప‌ర్మిట్ల‌ను తెచ్చుకొనేందుకు ఎయిర్ ఆసియా భారీ కుంభ‌కోనానికి పాల్ప‌డిన సంగ‌తి తెల‌సిందే. విమాన‌యాన శాఖ‌లో ఉద్యోగుల‌కు భారీ లంచాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ప‌ది ల‌క్ష డాల‌ర్లు లంచాలను విమానయాన శాఖ అధికారులు స్వీకరించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అంచనా వేసింది.

కేసు తీవ్రత దృష్ట్యా దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిగేందుకు కేసును సీబీఐకు అప్ప‌గించింది ఈడీ. వెంట‌నే రంగంలోకి దిగిన సీబీఐ వివుల‌వైన ఆధారాల‌ను సేక‌రించింది. ఇప్ప‌టికే విమాన‌యాన శాఖ‌లో కొంత‌మంది ఉద్యోగుల‌ను అరెస్ట్ చేయంతో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

అయితే తాజాగా ఈ కుంభ‌కోనంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు, మాజీ విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజుల పేర్లు బ‌య‌ట‌కు రావ‌డంతో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి.అవినీతి కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సమయంలో సీబీఐకు ఎయిర్‌ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది.

ఈ ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. అడ్డదారిలో పర్మిట్లు రావాలంటే చంద్రబాబును పట్టుకోవాలని ఎయిర్‌ ఏషియా గ్రూప్‌ సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌, ఎయిర్‌ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యాల మధ్య సంభాషణలు జరిగాయి.

చంద్రబాబును పట్టుకుంటే మనకు కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలు దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్‌ గజపతి రాజే చెప్పారు.’ అని ఆడియో టేపులో ఛాండిల్యా మాట్లాడారు.

అయితే ఈ ఆడియో టేపులు ఎప్ప‌టివో తెలియాల్సి ఉంది. భాజాపాతో విబేధించిన త‌ర్వాత అశోక్‌గ‌జ‌ప‌తి రాజు త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. స్ప‌ష్ట‌మైన ఆధారాలు సీబీఐకి చిక్క‌డంతో ఎయిర్‌ ఏషియా సీఈవో ఫెర్నాండెజ్‌ బుధవారం సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. విచార‌ణ‌లో ఎలాంటి నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌నేది ఇప్పుడు అస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -