Monday, May 13, 2024
- Advertisement -

కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను కోరిన పీఎమ‌వో

- Advertisement -
Ayesha meera murder case details asked pmo

పదేళ్ల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్టల్లో దారుణంగా అత్యాచారానికి, హత్యకు రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించింది.ఆయేషా మీరా కేసు ఎన్ని మ‌లుపులు తిరిగిందో అంద‌రికీ తెలిసిందే.ఈకేసులో అస‌లు దోషుల‌ను వ‌దిలి స‌త్యంబాబ‌ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించార‌నే ఆరోప‌న‌లు రాస్ట్ర‌వ్యాప్తంగా వినిపించాయి.అయితే ఈ కేసులో మ‌రోట్విస్ట్ చోటు చేసుకుంది.

ఆమె హత్య వెనుక కొందరు రాజకీయనాయకుల కుటుంబీకులు ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఆయేషా తల్లిదండ్రులు కూడా అదే చెప్పారు. అయినా పోలీసులు పేదవాడైన, చిల్లర దొంగతనాలు చేసే సత్యం బాబును అరెస్టు చేసి, అతనే హత్య చేశాడని నిరూపించే ప్రయత్నం చేశారు. సత్యం బాబు తల్లి, ఆయేషా మీరా తల్లిదండ్రులు కోర్టులో పోరాడారు. చివరికి హైకోర్టు సత్యంబాబు నిర్దోషి అని తేల్చి తీర్పు నిచ్చింది.

{loadmodule mod_custom,Side Ad 1}
అయితే ఈ కేసులో స‌త్యంబాబును అన్యాయంగా ఇరికించార‌ని కోర్టు తీర్పులో చెప్పింది.అంతా బాగానే ఉంది కాని అస‌లు దోషి ఎవ‌ర‌నేది ఇప్పుడు తేలాల్సిఉంది.అందుకే సత్యం బాబు నిర్దోషిగా బయటికి వచ్చాక… ఆయేషా మీరా తల్లిదండ్రులు తమ కూతూరును ఎవరు హత్య చేశారో తేల్చాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. దీనిపై పీఎంవో స్పందించింది. కేసుకు సంబంధించిన వివరాలు పంపాలంటూ సీఎస్ దినేష్ కుమార్ ను ఆదేశించింది.
తెనాలికి చెందిన ఆయేషా విజయవాడలోని నిమ్రా కాలేజీలో 2007లో చేరింది. అక్కడకి దగ్గర్లోని దుర్గా లేడీస్ హాస్టల్ లో చేరింది. అదే ఏడాది డిసెంబర్ 26వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురైంది. బాత్రూమ్ కి దగ్గర్లో అత్యాచారం చేసి, దారుణం చంపేశారు.ఇంత దారునంగా ఎందుకు చంపార‌నేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.ఆయేషా తల్లిదండ్రులు మాత్రం ఆ హత్య వెనుక ఆయేషా రూమ్మేట్స్ అయిన ఇద్దరు అమ్మాయిలు, వారితో ఎఫైర్ పెట్టుకున్న పెద్ద రాజకీయ నాయకుడి మనవడు, హాస్టల్ వార్డెన్ ఉన్నారని చెబుతున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}
మ‌రి ఈకేసులో అన్యాయంగా చిల్ల‌ర‌దొంగ‌త‌నాలు చేసె స‌త్యం బాబును పోలీసులు ఇరికించారు.చివ‌ర‌కు నిర్దోషిగా విడుద‌ల అయ్యారు.ఈకేసుకు సంబంధించిన కేసు వివ‌రాల‌ను పీఎమ్‌వో కోరింది.మ‌రి ఈ కేసులో అస‌లు దోషులెవ‌రో క‌నిపెట్టి వారికి శిక్ష‌విధిస్తారాని రాస్ట్రం లోని ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -