Saturday, May 18, 2024
- Advertisement -

భూమి,ఆకాశం, నీటిమీద‌నుంచి ప్ర‌యేగించే క్షిప‌నీ వ్య‌వ‌స్థ ప్ర‌పంచంలోనే లేదు…

- Advertisement -
BrahMos missile set to achieve yet another feat! To be test-fired from IAF’s Su-30 MKI fighter jet this summer

ప్ర‌పంచంలో అన్ని దేశాలు త‌మ సౌనిక సంప‌త్తిని రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నాయి. బ‌డ్జెట్‌లో ప్ర‌తీ సంవ‌త్స‌రం కేటాయింపులు భారీగానే పెంచుతున్నాయి. అభివృద్ది చెందుతున్న భార‌త్‌కూడా అగ్ర‌దేశాల‌తో స‌మానంగా ర‌క్ష‌ణ రంగానికి బ‌డ్జెట్‌ల‌ను ఎక్కువ‌గానే కేటాయిస్తోంది.

ఇక భార‌త్‌కు ఎటుచూసినా శత్రుదేశాలే ఎక్కువ‌. ప‌క్క‌లో బ‌ల్లెంలాగా పాకిస్థాన్‌, చైనా ఈరెండు దేశాలు ఏచిన్న అవ‌కాశం దొరికినా భార‌త్‌ను టార్గెట్ చేయ‌డం ప్రారంభిస్తాయి.మ‌రో ప‌క్క తీవ్ర‌వాదం ఉండ‌నే ఉంది. మ‌రోవైపు ద‌లైలామా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇప్పుడే చైనా భార‌త్ మీద మండిప‌డుతోంది. బెదిరింపుల‌కు దిగుతోంది. వీట‌న్నింటికి భార‌త్ చెక్ పెట్టేదానికి సిద్ధంగా ఉంది.
పాకిస్థాన్ మ‌ట్టికరిపించే స‌త్తా భార‌త్‌కు ఉంది.ఇప్పుడు ఎటొచ్చి చైనాతోనే అస‌లు స‌మ‌స్య‌. మ‌న‌కంటే ఎన్నో రెట్లు అన్నింటిలో చైనా ముందుడ‌టంతో భార‌త్ కు స‌మ‌స్య ఎద‌వుతోంది. ఇప్ప‌టికే భార‌త్ అమ్ముల‌పొదిలో అగ్నిసిరీష్ అన్వ‌స్త్ర శ్రేనులు ఉన్నాయి.వీటికి తోడు సూప‌ర్ సోనిక్ బ్ర‌హ్మాస్ క్షిప‌నులు ఉన్నాయి. ఇప్టటికే ఈ క్షిప‌నుల‌నుల ద్వారా శ‌త్రుదేశాలకు సందేశాన్ని ఇచ్చింది.అయితే ఇప్పుడ మ‌రో ప‌రీక్ష‌కు సిద్ద‌మ‌దుతోంది భార‌త్‌. ఇప్ప‌టి వ‌ర‌కు బ్ర‌హ్మాస్ క్షిప‌నుల‌ను నేల‌,నీటి మీద‌నుంచి ప్ర‌యేగాలు స‌క్సెస్ అయ్యి ఆర్మీకీ అప్ప‌గించింది .
భారత్ అత్యంత శక్తిమంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఎయిర్ వెర్షన్ పరీక్షలకు సిద్ధమైంది. శత్రుదేశాలకు వణుకు పుట్టిస్తున్న అత్యంత శక్తిమంతమైన ఈ క్షిపణిని జూన్‌ లో విమానం నుంచి పరీక్షించనున్నారు. తొలుత సుఖోయ్ యుద్ధవిమానం నుంచి రెండుసార్లు సాధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత లైవ్ టార్గెట్‌ పై పరీక్ష నిర్వహించనున్నట్టు రక్షణ వర్గాలు తెలిపారు.
అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని, సుఖోయ్ యుద్ధ విమానంతో బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా అనుసంధానం చేసినట్టు బ్రహ్మోస్ ఏరోస్పేస్ అధికారులు పేర్కొన్నారు. టెస్ట్-ఫైర్ విజయవంతమైతే ప్రపంచంలోనే ఈ తరహా శక్తికలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే క్షిపణి వ్యవస్థ ఇప్పటి వరకు ప్రపంచంలోనే లేదు. దీంతో బ్రహ్మోస్ అంటేనే చాలా దేశాలు వణుకుతున్నాయి.భ‌విష్య‌త్తులో శ‌త్రుదేశాల‌కు ఒక సంకేతాన్ని పంప‌నుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. చైనా, పాకిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉడండి…
  2. ఉత్త‌ర కొరియాకు ట్రంప్ తీవ్ర హెచ్చ‌రిక‌లు
  3. అంత‌ర్జాతీయంగా ప‌రిస్తితు లు ఉద్రిక్తం ..ఏక్ష‌ణ‌మైనా యుద్ధం
  4. కొరియాస‌మీప‌జ‌లాల్లోకిఅమెరికా యుధ్ద‌నౌక‌లు-యుధ్ద‌వాతా వ‌ర‌ణం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -