Tuesday, May 7, 2024
- Advertisement -

ఆకాశ్-1ఎస్ క్షిపణిని విజయవంతంగా ప‌రీక్షించిన డీఆర్డీవో..

- Advertisement -

ఆకాశ్-1 ఎస్ క్షిపణిని డీఆర్డీవో విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోని ల‌క్ష్యాల‌ను ఇది విజ‌య‌వంతంగా ఛేదిస్తుంది. దీశీయ ప‌రిజ్ణానంతో రూపొందించిన ఈ క్షిప‌ణి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీంట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. ఈ క్షిప‌ణిని మొబైల్ లాంఛ‌ర్‌తో ప్ర‌యోగించ‌వ‌చ్చు. దీన్ని ఒక ప్ర‌దేశం నుంచి మ‌రో ప్ర‌దేశానికి సుల‌భంగా త‌ర‌లించ‌వ‌చ్చు.

ఆకాశ్-1ఎస్ గగనతలంలో 30 కిలోమీటర్లు ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాన్ని సైతం తాకగలదు. గాల్లో ప్రయాణించే విమానాలనే కాదు, క్రూయిజ్ మిసైళ్లు, ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోగ‌ల‌దు. రెండు రోజుల కాలంలో రెండోసారి చేపట్టిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -