Saturday, May 18, 2024
- Advertisement -

పోటీలో ప్రధాన పార్టీలు

- Advertisement -

ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరెడ్డి మరణంతో ఏర్పడ్డ పాలేరులో ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఇందుకు ఈ నెల 22 వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 29వ తేది వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 16 వ తేదిన పోలింగ్,  మూడు రోజుల అనంతరం అంటే 19 వ తేదిన కౌంటింగ్ నిర్వహిస్తారు.

సరిగ్గా ఈ సమయంలో జరపాలనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీపై ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో వెంకరరెడ్డి వారసుల్ని ఎన్నికల బరిలో దించాలని ప్రధాన పార్టీలు టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. వెంకటరెడ్డి భార్యతో పోటీ చేయించి ఏకగ్రీవం చేయించాలన్నది కాంగ్రెస్ వ్యూహం.

అయితే ఆమెనే పార్టీలో చేర్చుకుని టిక్కట్ ఇచ్చి గెలిపించుకోవాలని టిఆర్ఎస్ ప్రతివ్యూహం. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి పాలేరు ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -