Friday, May 17, 2024
- Advertisement -

పోలీసులను బెదిరించిన కార్పొరేటర్‌కు షాక్

- Advertisement -

ఖాకీలపై వీరంగం వేసిన భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇలాఖాలో పోలీసులు అడుగు పెట్టొద్దని హుకుం జారీ చేశారు సదరు కార్పొరేటర్. అర్ధరాత్రి పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని తిరుగుతూ.. పోలీసులపై వీరంగం వేశారు. వాళ్ల విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా దుర్భాషలాడారు.

భోలక్‌పూర్‌లో అర్థ రాత్రి దాటిన తర్వాత కూడా తెరిచి ఉన్న దుకాణాలను మూసేయాల్సిందిగా స్థానికులను పోలీసులు కోరారు. అయితే రంజాన్ సందర్భంగా దుకాణాలు తెరిచి ఉంచుతామంటూ వారు పోలీసులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో అక్కడి వచ్చిన ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ పోలీసులను బెదిరించారు. పోలీసులు వంద రూపాయల మనుషులే అంటూ అవహేళన చేస్తూ మాట్లాడారు.

రంజాన్ మాసంలో రాత్రంతా విచ్చల విడిగా తిరుగుతాం.. నగరమంతా ఎక్కడైనా మాకు తినే పదార్థాలు ఉండాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారు. గతంలో లేడీ ఎస్ఐపై ఈ కార్పొరేటరే దురుసుగా వ్యవహరించారు. అప్పుడు అతనిపై ఏం చర్యలు తీసుకోలేదు. కానీ తాజా వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖ స్పందించింది.

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏంటి ?

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

ట్రిపుల్ఆర్ కు రాజమౌళి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -