Tuesday, April 23, 2024
- Advertisement -

కార్పొరేటర్ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్

- Advertisement -

ఎం.ఐ.ఎం కార్పోరేటర్ వ్యవహారం సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

ఎంఐఎం కార్పొరేటర్ పోలీసులను బెదిరించారంటూ వచ్చిన వార్తలపై ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఇలాంటి చెత్తను సహించబోమన్నారు. ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

ఎవరైనా సరే పోలీసులను గౌవించాల్సిందేనని తేల్చి చెప్పారు. కేటీఆర్ ట్వీట్ నేపథ్యంలో ముషిరాబాద్ పోలీసులు ఎంఐఎం కార్పొరేటర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 353, 506 కింద కేసు పెట్టారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసు శాఖ ట్వీట్ కూడా చేసింది.

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏంటి ?

చైతూ, సామ్ కలిపేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -