Thursday, May 23, 2024
- Advertisement -

ఓటుకు నోటు విచారణ…… ఎపి ఇంటెలిజెన్స్ మొత్తాన్ని వాడేస్తున్నారా?

- Advertisement -

‘నేనెవ్వరికీ భయపడను, నన్నెవ్వరూ భయపెట్టలేరు…….’….తాను చేసిన తప్పు ఏదైనా తన తలకు చుట్టుకుంటుందేమో…..అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై మోడీ విచారణ చేయిస్తాడేమో అన్న భయం పెరిగిన ప్రతిసారీ చంద్రబాబు రెగ్యులర్‌గా వాడే డైలాగ్ ఇది. అక్రమాలు, అవినీతి వ్యవహారాల్లో అరెస్ట్ అయితే అదంతా ప్రజల కోసం పోరాటం చేస్తున్నందుకే అన్న కలర్ ఇచ్చేందుకు సినిమా నటుడు శివాజీచేత ఆపరేషన్ గరుడ పేరుతో చంద్రబాబు ఆడిస్తున్న నాటకాలు అన్నీ ఇన్నీ కాదు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత నుంచీ ప్రతీక్షణం తనను తాను కాపాడుకోవడానికే సరిపోయింది చంద్రబాబుకు. బిజెపితో పొత్తు పెట్టుకుని కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూనే……..కాంగ్రెస్ పార్టీతో నెరిపిన చీకటి పొత్తు మోడీకి తెలిసిపోవడంతో మోడీతో పూర్తిగా తెగదెంపులు తెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక తర్వాత నుంచీ ప్రతి రోజూ బాబులో కనిపిస్తున్న భయం అంతా ఇంతా కాదు. అందుకే సందర్భం ఉన్నా…….లేకపోయినా నేను ఎవ్వరికీ భయపడను అని పదే పదే తన గురించి తానే చెప్పుకుంటూ ప్రజలను నమ్మించడానికి శతధా ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు.

అయితే చంద్రబాబులో భయం ఏ స్థాయిలో ఉందో తెలియచేసే విషయం ఇప్పుడు మరొకటి బయటపడిపోయింది. తాజాగా ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే రేవంత్ రెడ్డితో సహా నిందితుల ఇళ్ళపై విచారణ సంస్థల దాడులు, విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంపైన తాజాగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్‌లో కూడా చర్చ జరిగింది. అయితే అన్నింటికీ మించిన షాకింగ్ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు హైదరాబాద్‌లో జరగుతున్న ఓటుకు నోటు విచారణ ప్రక్రియను మొత్తం అనుక్షణం పరిశీలిస్తూ ఉండడం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పేలేదు అని బాబు, లోకేష్‌లతో పాటు టిడిపి నాయకులు, ఆ పార్టీ భజన మీడియా పెద్దలందరూ చెప్తూ ఉంటారు. చంద్రబాబు తప్పేలేనప్పుడు ఓటుకు నోటు కేసు విచారణ విషయంలో అంత భయం ఎందుకు? రీసెంట్‌గానే ఒక టిడిపి ఎమ్మెల్యేని మావోయిస్టులు చంపేశారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రెండు మూడు జిల్లాల ప్రజలు భయం భయంగా ఉన్నారు. అలాంటి విషయాలను వదిలేసి ఓటుకు నోటు కేసు విచారణపై ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని చంద్రబాబు వాడుకుంటూ ఉండడం దేనికి సూచిక? ఈ ప్రశ్నలకు ‘నిప్పు’ సమాధానం చెప్పగలడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -