Sunday, May 19, 2024
- Advertisement -

కోర్టులో చంద్ర బాబు న్యాయవాది వాదన..!

- Advertisement -

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై సీఐడీ కేసు కొట్టివేయాలంటూ తెలుగుదేశం అధినేత హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. సీఆర్డీఏ చట్టం ద్వారా తీసుకువచ్చిన జీవో చెల్లదనటం సరికాదని, ఐపీసీలోని సెక్షన్‌ 166, 167 ఈ ఫిర్యాదుకు వర్తించవన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టాలని.. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలకు, పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని లూథ్రా ఉన్నత న్యాయస్థానానికి తెలియజేశారు.

జీఓ విడుదలైన 35 రోజుల తర్వాత దానిని అప్పటి సీఎం ఆమోదించారని.. విచారణ నివేదికలోనే చెబుతున్నారన్నారు. అలాంటప్పుడు సీఎంకు తెలిసి జీఓ ఇచ్చారని ఎలా చెబుతారన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు చేయటం కుదరదని.. ఇక్కడ నష్టపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేయలేదని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి ఎక్కడా ఈ ప్రక్రియలో పాల్గొనలేదన్నారు. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుందన్నారు.

గ్రానైట్ పరిశ్రమల సమస్యలపై గళం విప్పిన నేత..!

విద్యార్థులపై కరోనా పంజా..!

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వారే టాప్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -