Friday, April 26, 2024
- Advertisement -

విద్యార్థులపై కరోనా పంజా..!

- Advertisement -

ఈ మద్య దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా రేసులు మళ్లీ పుంజుకున్నాయి. ఈ మద్య కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ప్రభుత్వ గురుకుల స్కూళ్లలో కొవిడ్‌ బారినపడుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని రెండు బాలికల పాఠశాలల్లో కలిపి 30 మందికి కరోనా సోకింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో 15 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

పాఠశాలలో 200 మంది విద్యార్థినులు ఉండగా.. అందులో 20 మంది గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీనిపై వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం వైద్య శిబిరం ఏర్పాటు చేసి కొవిడ్ పరీక్షలు చేయించారు. వారిలో 15 మంది విద్యార్థినులకు వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. వారిని వసతి గృహంలోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతులకు చెందిన 62 మంది విద్యార్థినులకు కొవిడ్ టెస్టులు నిర్వహించారు. వారిలో 15 మంది బాలికలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి మోహనకృష్ణ తెలిపారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థినులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి ఐసోలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు.

చర్చిలు, దేవాలయాలపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాదీ లకి భయం భయం..!

న్యాయవాద దంపతులు హత్య కేసులో కొత్త మలుపు.. మరో నిందితుడు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -