Tuesday, May 21, 2024
- Advertisement -

ఏపీ ప్రభుత్వ తీరుతో యోగాగురువుకు బాధ?!

- Advertisement -

మహాభారతంలో ‘భగవద్గీత’ బోధ అయ్యాకా  అర్జునుడు విషాదయోగాన్ని వీడి యుద్ధం చేస్తాడు. ఇదే యుద్ధం మధ్యలో అభిమాన్యుడిని కౌరువులు కుట్రద్వారా చంపితే అర్జునుడు బోరు మనడం మొదలుపెట్టాడట.

అర్జునుడిని చూసి కృష్ణుడు బోరు మన్నాడట. మరి అర్జునుడంటే కుమారుడు చనిపోయాడని ఏడుస్తున్నాడు.. నువ్వెందుకు ఏడుస్తున్నావు కృష్ణ అంటే.. ”భగవద్గీత ఉపదేశాన్ని విన్నా అర్జునుడికి ఇంకా తత్వం బోధపడలేదని అర్థమై..” అని కృష్ణుడు సమాధానం ఇచ్చాడట. భారతంపై కొంత చతురోక్తితో ప్రచారంలో ఉన్న ఒక పిట్ట కథ ఇది. 

ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు.. అంటే, చంద్రబాబు ప్రభుత్వ తీరును చూస్తుంటే ఈ కథ గుర్తుకొస్తోంది! ఎందుకంటే..ఆ మధ్య ఏపీ ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు, తెలుగుదేశం నేతలు కలిసి యోగా క్లాసులకు అటెండ్ అయ్యారు. బాగా ఫేమస్ అయిన యోగా గురువు ఒకరు వారికి శిక్షణనిచ్చారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడం.. మనసును నియంత్రించుకోవడం తదితరాలన్నింటి గురించి ఆయనవీరికి వివరించి చెప్పారు. దాని కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రెండు కోట్లరూపాయలు ఖర్చు పెట్టారు కూడా! ఈ వ్యవహారంపై అప్పట్లో చాలా మంది బుగ్గలు నొక్కుకొన్నారు. ప్రభుత్వ ఖర్చుతో యోగా ఏంటి? ప్రజల సొమ్ముతో ఈ ఆర్భాటాలేంటి అని వారు ప్రశ్నించారు. అది వేరేకథ. 

మరి అంత కాస్ల్టీ యోగా క్లాసులకు అటెండ్ అయినా కూడా తెలుగుదేశం వాళ్లకు.. స్వీయ నియంత్రణ అనేది అలవడినట్టుగా లేదు. ఇటీవల వీరు అసెంబ్లీలో రెచ్చిపోయిన తీరును పరిశీలించినా.. ప్రతిపక్షం లేని శాసనసభలో వైసీపీపై వీరు స్పందించిన తీరును చూసినా ఇది స్పష్టంగా అర్థం అవుతోంది. యోగాతో మానసిక ప్రశాంతత లభించాలి. కొంత స్థిత ప్రజ్ఞత అలవడాలి. యోగా ఉద్దేశమే అది. యోగాతో కేవలం శారీరక సమస్యలకు పరిష్కారమే కాకుండా.. మానసిక ధృఢత్వం లభిస్తుందంటారు. అయితే తెలుగుదేశం వారికి మాత్రం ఆ ఫలాలు దక్కినట్టు లేదు. వీరిలో మానసిక నియంత్రణ లేకుండా పోయింది. నోటికొచ్చినట్టుగా మాట్లాడటానికి వెనుకాడటం లేదు. వైకాపా వాళ్లంటే యోగాలూ గట్రా చేయలేదు. వాళ్లు రెచ్చిపోయారంటే ఏదోలే అనుకోవచ్చు. అయితే అధికారం చేతిలో ఉండి.. యోగా ను ప్రాక్టీస్ చేసి వచ్చి కూడా తెలుగుదేశం పార్టీకి కొంచెమైన స్థిత ప్రజ్ఞత లేకుండా పోయింది. మరి ఇప్పుడు వీరి చేత యోగా ప్రాక్టీస్ చేయించిన గురువు బాధపడుతుంటాడు కాబోలు!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -