Wednesday, May 15, 2024
- Advertisement -

కోదండరాం ని చూసి టీడీపీ బుద్ధి తెచ్చుకోవాలి – చంద్రబాబు

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ విభజన కి పూర్తిగా పాల్గొన్న ప్రముఖుడు ప్రొఫెసర్ కోదండరాం కి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రసంసలు అందించారు. రాష్ట్ర విభజన కి కారణం అయిన ఆ ఉద్యమ నేత ని చంద్రబాబు స్వయంగా పొగడడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాంటి పరిస్థితి అసలు ఎందుకు ఒచ్చిందో చూస్తే .. తెలంగాణా లోని టీడీపీ నేతలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా కెసిఆర్ ని విమర్శించడం లో బిజీ గా ఉన్నారు.

ప్రజల్లో కెసిఆర్ మీద నెగెటివ్ ప్రచారం చెయ్యడం, కెసిఆర్ చేస్తున్న పనులకి అవినీతినీ బయట పెట్టడం లో భయపడుతున్నారు అనేది చంద్రబాబు ఉద్దేశ్యం అలాంటి చోట కోదండరాం మాత్రమె తెగించి కెసిఆర్ చేసే అరాచకాల గురించి మాట్లాడుతున్నారు. తమ పార్టీ టీ టీడీపీ కెసిఆర్ ని ఎదిరించడం లో వెనకపడింది అని చంద్రబాబు బాగా ఫీల్ అవుతున్నారు. దీంతో ఇక్కడ నష్టనివారణ చర్యల కోసం ఆయన టీ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు.

తెలంగాణలో టీడీపీ సైకిల్ను పరుగులు పెట్టించాలని – 2019 ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని – ముఖ్యంగా ప్రభుత్వ వైఖరిని – పాలనా లోపాలను ఎండగట్టాలని అక్కడి నేతలకు హితబోధ చేశారట. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ కోసం అహరహం శ్రమించిన ప్రొఫెసర్ కోదండరామ్ విషయాన్ని ప్రస్తావించారట. తెలంగాణ అంటే అంత ప్రేమ ఉన్న వ్యక్తే ఇప్పుడు కేసీఆర్ పై విమర్శలు సంధిస్తున్నారని పాలనా లోపాలను మీడియా ముఖంగా ఎండగడుతున్నారని – అవకాశం వచ్చిన ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారని వివరించాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -