Saturday, May 4, 2024
- Advertisement -

బాబు తన శక్తిని ఉపయోగించి ఆయనను తప్పించగలడా!

- Advertisement -

ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగనున్నాడట. ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నాడట. గవర్నర్ తీరు సరిగ్గా లేదు.. ఆయనను తప్పించాల్సిందేనని స్పష్టం చేయనున్నాడట.

ఈ మేరకు స్వయంగా ఈ విషయాన్ని చంద్రబాబే ప్రకటించారు. గవర్నర్ నరసింహన్ తీరును తీవ్రంగా ఖండించాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గవర్నర్ స్వతంత్రంగా పని చేయడం లేదని చంద్రబాబు అంటున్నారు.

ఈ విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన ప్రకటించాడు. ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్టుగా పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న నరసింహన్ విషయంలో ఇప్పటికే తెలుగుదేశం వారు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్వయంగా బాబు వెళ్లి ఆయన విషయంలో ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయనుండటం ఆసక్తికరమైన అంశమే.

మరి బాబు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం నరసింహన్ ను తప్పిస్తుందా? తమ మిత్రపక్ష పార్టీ అధినేత ఆగ్రహాన్ని అర్థం చేసుకొని ఈ కాంగ్రెస్ నియమిత గవర్నర్ ను పక్కన పెడుతుందా? అనేది ఆసక్తికరమైన అంశం. మరి ఒకవేళ బాబు ఫిర్యాదుపై స్పందించి ఆయనను తప్పిస్తే పర్వాలేదు. లేకపోతే బాబు కంప్లైంట్ చేసిన నరసింహన్ ను కేంద్రం తప్పించడం లేదు.. ఇదీ ఆయనకు కేంద్రం వద్ద ఉన్న విలువ అనే కామెంట్ వినిపించే అవకాశం కూడా ఉంది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -