అందమైన పాక్, చైనా యువతులు సిద్ధంగా ఉన్నారు.

అంద‌మైన యువ‌తులు ..చూసి ప‌రిచ‌యం పెంచుకున్నారో అంతే సంగ‌త‌లు. సోషియ‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎక్కువ‌వుతున్నాయి. శత్రువుల‌ను మ‌ట్టు పెట్టేందుకు అమ్మాయిన‌ల‌ను పేస్‌బుక్‌ల ద్వారా గాలం వేసిస సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. ఇలాంటి బాధితుతులు సామాన్యులేకాదు.. ఆర్మీ అధికార‌లుకూడా ఉన్నారు.

అంద‌మైన అమ్మాయిల‌కోసం ఏప‌ని చేసెదానికైనా వెనుకాడ‌ని కామాంధులు ఉన్నారు. చివ‌రికి భార‌త ఆర్మీకి సంబంధించిన ర‌హ‌స్యాల‌నుకూడా శ‌త్రుదేశాల‌కు చేరివేసిన సంఘ‌ట‌నలు జ‌రిగాయి. ఎంత‌వార‌ల‌యిన కాంత‌దాసులే క‌దా. అందుకే ఇప్పుడు ఇంటెలిజెన్స్ సంస్త‌లు హెచ్చ‌రిస్తున్నాయి.

అందమైన పాకిస్థాన్, చైనా దేశాలకు చెందిన యువతులు వల విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు…చాలా జాగ్రత్తగా ఉండాలని భారత్ లోని త్రివిధ దళాల అధికారులకు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఇండియన్ ఆర్మీ అధికారులను లక్ష్యం చేసుకుని వల విసురుతారని హెచ్చరికలు జారీ అయ్యాయి.

లాహోర్ వేదికగా అందమైన పాక్, చైనా యువతులు అనర్ఘళంగా హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ మాట్లాడుతూ, వల విసురుతారని నిఘా వర్గాలు తెలిపాయి. సామాజిక మాధ్యమాల ఆధారంగా వారు హనీ ట్రాప్ విసిరేందుకు సిధ్ధంగా ఉన్నారని తెలిపాయి. పరిచయం పెంచుకుందామన్న నెపంతో ఆహ్వానిస్తాయని. ఏమాత్రం వారి వలకు చిక్కారా? ఇక వారి పని అయిపోయినట్టేనని తెలిపాయి.

సీక్రెట్ వీడియోలు తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తారని హెచ్చరించాయి. ప్రధానంగా ఆర్మీ స్ధావరాలు, ఆయుధాల వివరాలు, సైన్యం రహస్యాలు తెలుసుకునేందుకు, లేదా సైన్యాన్ని చేరుకునేందుకు ఈ రకమైన హనీ ట్రాప్ విసురుతారని అన్నారు. ఈ మేరకు పాక్, చైనాలు కుట్రచేశాయని నిఘా వర్గాలు తెలిపాయి.