- Advertisement -

ఇది నంద్యాల రియాలిటీ ఉప ఎన్నిక‌..

- Advertisement -

నంద్యాల‌లో వైసీపీ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌తో ఉప ఎన్నిక మ‌రింత వేడెక్కింది.జ‌గ‌న్‌కూడా 9 నుంచి 21 వ‌ర‌కు అక్క‌డే ఉంటాన‌ని చెప్ప‌డంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ఏరేంజ్‌లో ఉంటుందో చూసుకోవ‌చ్చు. నిజానికి టీడీపీ, వైసీపీలు తమ బలాబలాల కన్నా కుల సమీకరణాలనే బలంగా ప‌ని చేయ‌నున్నాయి. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకుని ఈ రెండు పార్టీలు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ముస్లింలకు కేబినెట్‌లో స్థానం ఇవ్వకపోవడం.. సంక్షేమ కార్యక్రమాల విషయంలోను వారి పట్ల అంత శ్రద్ద పెట్టకపోవడం.. టీడీపీకి ప్రతికూలంగా మారాయి. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తుగడలను టీడీపీ ముందుగానే పసిగట్టినట్లుంది.నంద్యాలలో ముస్లిం మైనారిటీలంతా ఎక్కువగా అభిమానించే ఇంతియాజ్ అహ్మద్ కు ఆ పార్టీ గాలం వేసింది. . నేష నల్‌ విద్యాసంస్థల చైర్మన్‌గా, నేషనల్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆయన అందరికీ సుపరిచితమే.

ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2.30లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 70వేలకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారంటే.. ఇక్కడ వారి ప్రాబల్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారిని ప్రసన్నం చేసుకోవడం కోసమే గత రంజాన్ మాసంలో సీఎం చంద్రబాబు రూ.1కోటి ఖర్చు పెట్టి మరీ వారికి ఇఫ్తార్ విందు ఇచ్చారు

మొత్తం మీద నంద్యాల ఉపఎన్నికను డిసైడ్ చేయడంలో ముస్లిం సామాజిక వర్గం ‘కీ’రోల్ పోషించనుంది. ఈ ఎన్నిక 2019జైత్రయాత్రకు నాంది అన్నారు.అదే విధంగా ఎమ్మెల్సీ సీటు ముస్లింల‌కు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు.ఇంతియాజ్ అహ్మద్ తమ పార్టీలో చేరాడు కాబట్టి టీడీపీకే విజయవకాశాలు ఎక్కువ అని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది.

వైసీపీ, ఇటు టీడీపీ ఎవరికీ వారు.. మేం ముస్లింల పక్షపాతం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముస్లిం మైనారిటీలు ఈ రెండు పార్టీల్లో ఎవరి మాటలను విశ్వసిస్తారన్నదే నంద్యాల ‘గెలుపు’ను డిసైడ్ చేయనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -