Thursday, May 16, 2024
- Advertisement -

విరుచుకుపడ్డ కాంగ్రెస్

- Advertisement -

రెండేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్న కె.చంద్రశేఖర రావు ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, పొంగులేటి సుధాకర రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కెసిఆర్ పాలన దారుణంగా ఉందన్నారు.

మాటిమాటికి డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి ప్రస్తావించే కెసిఆర్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎక్కడా ప్రారంభించలేదన్నారు. నిజానికి ఇంకా టెండర్లే ఖరారు చేయలేదని వారు ఆరోపించారు. వీటికోసం ఇప్పటి వరకూ మూడు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కరూ రాలేదని దుయ్యబట్టారు. ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని ఏడు లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ఎంత సేపు ఫిరాయింపులు (డిఫెక్షన్), ఎన్నికలు (ఎలక్షన్), సంబురాలు (సెలబ్రేషన్) లోనే తేలి ఆడుతోందని వారు విమర్శించారు.

రాష్ట్రంలో నానాటికి అవినీతి పెరిగిపోతోందని, ఇప్పటికి వరకూ అవినీతిపై ఎన్ని కాల్స్ వచ్చాయో, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు వివరించాలన్నారు. ఈ రెండేళ్లలో అమలు పరిచిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -