Monday, May 20, 2024
- Advertisement -

అన్ని పార్టీలు ఒకే తాటిమీద‌కు వ‌స్తాయా….? ఇదే జ‌రిగితె టీడీపీ బంగాళాఖాతంలో క‌ల‌వ‌డం ఖాయం.. ?

- Advertisement -

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌ని చంద్ర‌బాబు కుయుక్తులు ప‌డుతున్నాడు. దాన్ని అటుంచితే రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని ప్ర‌ణాలిక‌లు రచిస్తున్నారు. అయితే విబ‌జ‌న బిల్లులో ఇచ్చిన హామీల‌ను టీడీపీ-భాజాపా పూర్తిగా తుంగ‌లోకి తొక్కారు. ఇవి సాధించ‌డంలో బాబు స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌మేలేకుండా చేయాల‌ని చూస్తున్న బాబుకు ప్ర‌జ‌లే బంగాళాఖాతంలో క‌ల‌ప‌డం ఖాయ‌మ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. విప‌క్షాల‌న్ని క‌ల‌సి వీటిని ప్ర‌జ‌ల‌ల్లోకి బ‌లంగా తీసుకెల్తాయా అనేది సందేహంగా ఉంది.

క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ‌నున ఏర్పాటు చేస్తామ‌ని విభ‌జ‌న బిల్లులో పొందుప‌రిచారు. అయితే దీన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టారు. 2019 ఎన్నికల్లో కూడా కడపపై అధికార, ప్రతిపక్షాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ అంశం కడపలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క‌డప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధనకోసం జిల్లా మొత్తం ఏకమైంది. అధికార పార్టీలు మినహా మిగిలిన అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వచ్చి ఉక్కుప‌రిశ్ర‌మ‌ను స్థాపింప‌చాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

దీనికితోడు విభ‌జ‌న బిల్లులో ప్ర‌త్యేక హోదాతోపాటు విశాఖ‌కు రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ , కడప ఉక్కు.. ఇలా ఎన్నో హామీలు అందులో ఉన్నా కూడా మోదీ సర్కార్ చిత్తశుద్ది ప్ర‌ద‌ర్శించ‌డంలేదు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా ఎన్‌డీఏతో రాజీ ప‌డి ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు స‌మాధిక‌ట్టార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్ లోటు బడ్జెట్ లో ఉందంటూనే హంగుఆర్భాటాలకు కోట్లకు కోట్లు ఖర్చు చేస్తోందని నేతలు ఆరోపించారు. రాజ‌కీయ పార్టీనాయ‌కుల‌తోపాటు ప్ర‌జ‌ల‌ల్లో కూడా ఇదే భావ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే కడప ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. అసలు కడప ఉక్కుపై టీడీపీ, బీజేపీలు తమ వైఖరి వెల్లడించాలని విపక్షాలన్నీ ముక్తకంఠంతో నినదించాయి.

ఇంత వ‌ర‌కు బాగానె ఉన్నా వీటిని ప్ర‌జ‌ల‌ల్లోకి ఎలా తీసుకెల్తారో అనేదానిమీద వ‌చ్చే ఎన్నిక‌లు ఆధార‌ప‌డి ఉన్నాయ‌నేది రాజ‌కీయాల వ‌ర్గాలు భావిస్తున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీతోపాటు, జ‌న‌సేన‌,కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, ఇత‌ర ప్ర‌జాసంఘాలు అన్నీ క‌ల‌సి ఒకేతాటిమీద‌కు వ‌చ్చి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ల్లోకి వెల్తే టీడీపీని బంగాల ఖాతంలో క‌ల‌వ‌డం ఖాయం. మ‌రి అన్ని పార్టీలు ఒకే తాటిమీద‌కు వ‌స్తాయా.. అనేది వేచి చూడాలి…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -