Saturday, May 18, 2024
- Advertisement -

కార్బైన్​ తుపాకుల కోసం వేచి ఉన్నాం..!

- Advertisement -

భారత సాయుధ దళాల చేతికి త్వరలోనే అత్యాధునిక స్వదేశీ కార్బైన్​ తుపాకులు అందనున్నాయి. డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన 5.56×30ఎంఎం జాయింట్​ వెంచర్​ ప్రొటెక్టివ్​ కార్బైన్​ తుపాకులు (జేవీపీసీ) సైనిక సేవల్లో చేరేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల​ 7న నిర్వహించిన తుది దశ పరీక్షలో అన్ని రకాల ప్రమాణాలను కచ్చితత్వంతో నిరూపించుకున్నట్లు అధికారులు తెలిపారు.

కార్బైన్​ తుపాకుల​ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తోంది భారత సైన్యం. గతంలో పశ్చిమాసియాకి చెందిన తుపాకులను కొనుగోలు చేసేందుకు ఎంపిక చేయగా.. తుది దశలో టెండర్​ ఆగిపోయింది. ఈ క్రమంలో డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన కార్బైన్​ తుపాకులు​ అన్ని పరీక్షలను పూర్తి చేసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కార్బైన్​ గన్స్​ కోసం ఎదురుచూస్తోన్న సైన్యం కల నెరవేరనుంది.

ఈ తుపాకులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు పరీక్షలను విభిన్న పరిస్థితుల్లో నిర్వహించారు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలో, శీతాకాలంలో అత్యంత ఎత్తులో ఈ పరీక్షలు చేపట్టారు. అన్ని పరీక్షల్లోనూ ఈ తుపాకులు కచ్చితమైన ఫలితాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -