- Advertisement -

స్పేస్​ ఎక్స్ వాయిదా..!

- Advertisement -

అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని ‘స్పేస్​ ఎక్స్’ ఆదివారానికి వాయిదా వేసింది. భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రయోగం చేపడితే రాకెట్ బూస్టర్​ను తిరిగి సంపాదించడం కష్టమవుతుందని ‘స్పేస్ ఎక్స్’ పేర్కొంది.

షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి ఈ ప్రయోగం జరగాల్సింది. ఈ ప్రయోగం ద్వారా నలుగురు (ముగ్గురు అమెరికన్, ఒక జపాన్​) వ్యోమగాములను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది స్పేస్ ఎక్స్.

స్పేస్​ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్​కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో భిన్నమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఒకేరోజు నిర్వహించిన నాలుగు ర్యాపిడ్ పరీక్షల్లో రెండుసార్లు పాజిటివ్, రెండుసార్లు నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు మస్క్ తెలిపారు. కచ్చితమైన పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

విస్తరణవాద శక్తులకు గట్టిగా బదులిస్తాం : మోదీ

కొత్త పదజాలంతో తికమక చేసిన డబ్ల్యూహెచ్​ఓ..!

ఆ వ్యక్తి తలపై 10 మిలియన్ల రివార్డు..!

అమెరికా ఎన్నికలపై ఫేస్​బుక్ కామెంట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -