Friday, May 17, 2024
- Advertisement -

మ‌ళ్లీ.. లోకేష్ తోడ‌ల్లుడి కోసం!

- Advertisement -

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన చంద్ర‌బాబు క్యాబినెట్ లో తీసుకున్న ప్ర‌ధాన నిర్ణ‌యం వెనుక క్విడ్ ప్రో కో తతంగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఐతే ఏపీలో ఉన్న ఫెర్రో అల్లాయిస్ ప‌రిశ్ర‌మ‌ల్లో ఎక్కువగా టీడీపీ నాయ‌కుడివే. ఐతే టీడీపీ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తోడ‌ల్లుడు భ‌రత్ తండ్రి రామారావు ఈ రంగంలో పెద్ద ప‌రిశ్ర‌మ‌ల నిర్వాహ‌కుడిగా ఉన్నారు.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇలాంటి కంపెనీలకు ప్రయోజనం చేయబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే విద్యుత్ స‌బ్సిడీల పేరుతో  కోట్ల రూపాయ‌ల ప్ర‌యోజ‌నం క‌లిగించింది. ఐతే ఒక‌ప్పుడు రామారావు తండ్రి ప్ర‌స్తుత ఎమ్మెల్సీ ఎమ్వీఎస్ మూర్తి ప్రారంభించిన ఈ కంపెనీ ప్ర‌స్తుతం భారీ లాభాల్లో సాగుతోంది. అలాంటి కంపెనీకి ఇప్పుడు మ‌రోమారు సబ్సిడీలు ఇవ్వ‌డం వెనుక ఉన్న బంధుప్రీతి స్ప‌ష్ట‌మేన‌ని అంతా భావిస్తున్నారు.

ఐతే సామాన్య వినియోగ‌దారుల ఈ సబ్సిడీలు భ‌రించ‌లేక‌పోతున్నామంటూ మడిపడుతున్నారు. అస‌లే ఆర్థిక ప‌రిస్థితి అంతంత‌మాత్రంగా ఉంది ఇలాంటి సమయంలో ఈ కార్పోరేట్ కంపెనీల‌కు ప్ర‌భుత్వ సొమ్ముల‌ను స‌బ్సీడీల రూపంలో దార‌పోయ‌డం దుమారం రేపుతోంది. దాంతో అత్త‌సొమ్ము అల్లుడు దానం చేసిన‌ట్టుగా ప్ర‌జ‌ల సొమ్ము కంపెనీల‌కు క‌ట్ట‌బెడుతున్న‌ట్టు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -