Sunday, May 19, 2024
- Advertisement -

సుఖ‌వ్యాధికి మొద‌టిసారిగా వ్యాక్సిన్‌..

- Advertisement -

సుఖ వ్యాధులలో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది గ‌నేరియా. ఇది ఎక్కువ‌గా ర‌తిక్ర‌యి ద్వారా సంక్ర‌మిస్తుంది. దీని గురించి బయటకు చెప్పుకోలేక.. ఆ బాధ అనుభవించలేక ఎంతోమంది నిత్యం నరకం చూస్తున్నారు.

దీంతో వ్యాధి ముదిరిపోయి.. భాగస్వాములకు కూడా అంటుకుని.. అంతిమంగా సంసారం దుర్భరంగా తయారవుతుంది. కాని ఇప్పుడు ఆలాంటి ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు.మొద‌ల సారిగా వైద్య చ‌రిత్ర‌లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది.
ప్రపంచ వైద్య చరిత్రలో తొలిసారిగా సుఖవ్యాధి గనేరియా సోకకుండా ఓ వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వాక్సిన్ తో సూపర్ గనేరియానూ అరికట్టవచ్చని యూనివర్శిటీ ఆఫ్ ఆక్లాండ్ రీసెర్చర్ల బృందం వెల్లడించింది. గనేరియా వ్యాధి సోకిన 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులపై పరీక్షలు జరిపి విజయవంతం అయ్యామని తెలిపింది.
2004 నుంచి 2006 మధ్య కాలంలో 11 సెక్సువల్ హెల్త్ క్లినిక్ లను సంప్రదించి, ఈ వాక్సిన్ ను పంపిణీ చేశామని, ఆపై వారి లైంగిక కార్యకలాపాలపై అధ్యయనం చేయగా, వాక్సిన్ తీసుకున్న వారిలో గనేరియా వైరస్ ను తట్టుకునే శక్తి అధికమైందని పేర్కొంది.
‘మీఎన్జడ్బీ’ పేరిట ఉన్న ఈ వాక్సిన్ గనేరియాను సమర్థవంతంగా నియంత్రించిందని వెల్లడించింది. ఈ వాక్సిన్ వైద్య చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని మినింగిటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎక్స్ పర్ట్ లిండా గ్లెన్నీ వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -