Saturday, May 18, 2024
- Advertisement -

దెబ్బ‌కు దిగివ‌చ్చిన ప్ర‌భుత్వం

- Advertisement -
Garbage dumped on Tirupati RC Puram bridge issue

రాష్ట్రంలో మ‌హామ‌వుల‌ను ఇబ్బందుల‌కు గురిచేసె చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఓఎమ్మెల్యే ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించారు.దెబ్బ‌కు ద‌య్యం వ‌దిలిన‌ట్టు స‌ర్కార్ దిగి వ‌చ్చింది.

ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు ఇచ్చేందుకు కూడా అంగీకరించని చంద్రబాబు ప్రభుత్వం… ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పోరాటానికి దిగిరావడం చర్చనీయాంశమైంది.
చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ వేలాది మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో స్థానికులకు అండగా చెవిరెడ్డి రంగంలోకి దిగారు. అయితే ఎప్పటిలాగే వందలాది మంది పోలీసులు వచ్చి చెవిరెడ్డినికేసులు పెట్టి లోపలేశారు. అయితే ప్రభుత్వ తీరుకు నిరసనగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి జైల్లోనే దీక్షకు దిగారు. కోర్టు బెయిల్ ఇవ్వగా బయటకు వచ్చిన తర్వాత కూడా దీక్షను కొనసాగించారు.

{loadmodule mod_custom,GA1}

మొండిగటమైన చెవిరెడ్డి ద్రవపదార్దాలు కూడా తీసుకోకుండా దీక్షకు దిగారు. దీంతో ఆయన కోమాలోకి వెళ్లే పరిస్థితి ఉందని వైద్యులు హెచ్చరించారు. దీంతో కంగారు పడ్డ జిల్లా అధికారులు … దయచేసి ఉద్యమాన్ని ఆపేయండి… వెంటనే డంపింగ్ యార్డ్ ఎత్తివేస్తామని విన్నవించుకున్నారు. మూడు నెలల్లో డంపింగ్‌ యార్డ్ లేకుండా శుభ్రం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో చెవిరెడ్డి దీక్ష విరమించారు.బహుశా చంద్రబాబు మూడేళ్ల పాలనలో ఒక వైసీపీ ఎమ్మెల్యే పంథానికి ప్రభుత్వం లొంగడం ఇదే తొలిసారి కాబోలు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}2yTeH45ljUY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -