Saturday, May 18, 2024
- Advertisement -

కేంద్రం అంగీకరించిందన్న తుమ్మల

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోడ్ల విస్తరణ కోసం కేంద్రం మూడు వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని కేంద్రం సూత్రప్రాయంగా చెప్పారు. రాష్రంలో రోడ్లు, భవనాల నిర్మాణ ప్రగతిపై మాదాపూర్ లో జరిగిన ఓ సదస్సులో మంత్రి తుమ్మల మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో 1850 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఇందులో 14 రహదారులకు సంబంధించిన సమాచారాన్ని కేంద్రానికి పంపించామని, మూడు డిపిఆర్ లను కేంద్రం అంగీకరించిందని ఆయన అన్నారు.

రహదారుల విస్తరణలో భాగంగా తొలి విడతగా మూడు వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని, రాష్ట్రంలో ఏఏ రోడ్ల విస్తరణకు ఈ నిధులు వెచ్చించాలనే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల చెప్పారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -