Wednesday, May 22, 2024
- Advertisement -

చైనాకు భార‌త్ షాక్…అరుణాచల్ ప్రదేశ్ లోకి విదేశీయులను అనుమతించిన భారత్

- Advertisement -

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల అందాలను వీక్షించేందుకు విదేశీయులను అనుమతించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అంటూ ఇంతకాలం భారత్ పై ఒత్తిడి తీసుకొస్తున్న చైనాకు పరోక్షంగా భారత్ తన నిర్ణయంతో షాకిచ్చినట్టయింది. అంతర్గత మంత్రిత్వ శాఖల సమన్వయ కమిటీ సమావేశం అనంతరం కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది.

కేంద్రం సడలించిన నిబంధనలతో జమ్మూ కశ్మీర్లోని లడఖ్, సిక్కిమ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ కూడా మరింత లబ్ధి చేకూరుతుంది. పర్యటక శాఖపై వేసిన మంత్రుల సహకార కమిటీ సమావేశం తర్వాత కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. సురక్షిత ప్రాంత అనుమతి విధానంలో భాగంగా గతంలో అరుణాచల్ ప్రదేశ్ సందర్శనకు ఇచ్చిన రెండేళ్ల అనుమతికి బదులుగా, దీన్ని ఐదేళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అరుణాచల్‌లో ముఖ్యమైన ప్రాంతాలైన తవాంగ్ లోయ, జిరో, బొమిడిలాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగేలా కేంద్ర పర్యటక శాఖ చర్యలు చేపట్టింది.

గ‌తంలో ఆంక్ష‌ల‌నేప‌థ్యంలో సమీప ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాల వరకు వచ్చిన పర్యాటకులకు ఇక్కడ పర్యటించే అవకాశం లభించడం లేదు. దీంతో మరింత మంది పర్యాటకులు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించేందుకు వీలుగా నిబంధనలు సడలించాలని కేంద్ర పర్యాటక శాఖ కోరగా, దానికి ఆమోదముద్ర పడింది. సానుకూల నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ హర్షం వ్యక్తం చేశారు.

అరుణాచల్‌లో పర్యటకానికి మరింత ప్రాచుర్యం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని, బౌద్దంతో సంబంధం ఉన్న తవాంగ్ పర్యటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినా, తూర్పున దిబాంగ్ లోయలో పర్యావరణహిత పర్యటకాన్ని అన్వేషించే ప్రక్రియను కూడా చేపట్టామని పర్యటక శాఖ కార్యదర్శి రష్మీ వర్మ పేర్కొన్నారు. మరోవైపు అరుణాచల్‌లో షంగ్‌స్టర్ సరస్సు, తవాంగ్ లోయ లాంటి సుందర ప్రాంతాలు ఉన్నాయని తెలియజేస్తూ ఆ రాష్ట్ర సీఎం ఫెమా ఖండూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -