Saturday, May 18, 2024
- Advertisement -

ముంబై దర్గా లో ఆడవారు రావచ్చు

- Advertisement -

శని సింగానాపూర్ , త్రయంబకేశ్వర్ ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని కోరుతూ పోరాటం చేసిన భూమాతా బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ ఇప్పుడు మరొక విజయాన్ని అందుకున్నారు. దేశ ఆర్ధిక రాజధాని ముంబై లోని హాజీ ఆలీ దర్గా లో మహిళలు ప్రవేశించకూడదు అంటూ నిషేదాలు ఉన్నాయి దీన్ని ఛాలెంజ్ చేసిన ఆమెకి కోర్టు సపోర్ట్ ఇచ్చింది.

తొలుత ఈ దర్గాలోకి మహిళల్ని అనుమతించే వారు. 2012లో దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని విధించారు. దీంతో.. దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది.

ఈ వ్యాజ్యాన్ని విచారించిన బాంబే హైకోర్టు తాజాగా తన తీర్పును ప్రకటించింది. దర్గాలోకి మహిళల్ని రాకుండా నిషేధం విధించటం వారి ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లేలా చేయటమేనని చెప్పిన కోర్టు.. వారి ప్రవేశానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -