Thursday, May 16, 2024
- Advertisement -

టీఆర్ఎస్ లో హరీష్ రావును తొక్కేస్తున్నారా…?

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కే‌సి‌ఆర్ తన కుటుంబ సభ్యులకే పదవులను కట్టబెడుతున్నాడని ప్రతిపక్షాలు బహిరంగంగా విమర్శిస్తుంటే… ఆ సొంత పార్టీ నేతలు కూడా చాటుమాటుగా గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో ఉన్న నేతలను తొక్కేసే మాట ఎలా ఉన్నా.. పార్టీలో సొంత మేనల్లుడు హరీష్ రావు ను ఎదగనీయకుండా కే‌సి‌ఆర్ తొక్కేస్తున్నాడని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన వరంగల్ ఉపఎన్నిక, ప్రస్తుతం జరుగుతున్న స్ధానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను చూపెడుతున్నారు. వరంగల్ ఉపఎన్నికలో హరీష్ కు అత్యంత సన్నిహితుడైన ఎర్రోళ్ళ శ్రీనివాస్ కు టికెట్ ఇస్తారని భావించగా, ఆ వాదనను పక్కన పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాల తయారీలో ప్రముఖ పాత్ర పోషించాడని చెపుతూ కే‌టి‌ఆర్ కు అత్యంత సన్నిహితుడైన పసునూరి దయాకర్ కు ఆ సీటును కేటాయించారు కే‌సి‌ఆర్.

ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం … హరీష్ రావు వర్గాన్ని ప్రక్కన పెట్టి, కే‌టి‌ఆర్ కు సన్నిహితులకు టికెట్లు కేటాయించడం వంటివి జరిగాయి.

ఈ పరిణామాలన్నీ ఒక్కసారి గమనిస్తే తన కొడుకు కే‌టి‌ఆర్ ను టీఆర్ఎస్ లో కీలకనేతగా ఎదగనిస్తూ, హరీష్ రావును నామమాత్ర నేతగా ఉండనిచ్చేలా కే‌సి‌ఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు ఉంది. అంతేకదా ఎంతైనా ‘పేకాట పేకాటే … బామర్ధి బామర్దే’. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -