Thursday, May 16, 2024
- Advertisement -

మాజీ స్పీకర్ కోడెలకు కు గుండె పోటు….హైదరాబాద్ కు తరలింపు…?

- Advertisement -

కేసులతో సతమత మవుతున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు గెండెపోటుకు గురయ్యారు. ఆయనకు గుండేపోటు రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం నాడు ఉదయం కోడెల నివాసంలో కంప్యూటర్లను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ సీపీ నేతల హస్తం ఉందని కోడెల ఆరోపించారు. ఈ కేసుల విషయంపై పార్టీ నాయకులు, న్యాయవాదులతో ఫోన్లో మాట్లాడుతున్నసమయంలనే ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోడెల అల్లుడు డాక్టర్ మనోహర్ వైద్యపరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.

ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో గుంటూరు, విజయవాడ నుంచి ప్రముఖ వైద్యులు ఆస్పత్రికి చేరుకుని చికిత్స అందిస్తున్నారు. ఓ దశలో కోడెలను గుంటూరు నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించాలని భావించారు. నిపుణులైన వైద్యులు అందుబాటులోకి రావడంతో ట్రీట్‌మెంట్‌ను బట్టి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

గత కొంత కాలంగా వరుస వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతంలోనూ కోడెల శివప్రసాదరావుకు ఓ సారి గుండెపోటు వచ్చింది. అప్పుడు చికిత్స చేసిన వైద్యులు స్టెంట్ అమర్చారు. కోడెలకు హార్ట్ ఎటాక్ రావడం ఇది రెండోసారి.ఆయన కూతురు, కొడుకుపై భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీనికితోడు హైదరాబాద్‌లో అసెంబ్లీ నుంచి అమరావతికి తరలించాల్సిన సామగ్రిని తన సొంత ఇంటికి, తన కుమారుడి షోరూమ్‌కి తరలించారని ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆయన కూడా అంగీకరించారు. ఆఫీసులో స్థలం లేకపోవడం వల్ల తన వద్ద భద్రపరిచానని, కావాలంటే తీసుకుని వెళ్లొచ్చనికూడా చెప్పారు. ఓ స్పీకర్‌గా పనిచేసిన ఆయన ఇలా కుర్చీలు, బెంచీలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ ఇంటికి తీసుకుని వెళ్లడం రాజకీయాల్లో పెనుదుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -