Monday, April 29, 2024
- Advertisement -

చిన్న వయసులోనే గుండె పోటు రావడానికి కారణాలు ఏంటో తెలుసా ?

- Advertisement -

నేటి రోజుల్లో గుండెపోటు ఏ వయసులో ఉన్నవారికైనా సంభవిస్తూ ఉండడం గమనార్హం. ఒకప్పుడు గుండె పాటు ఎక్కువ శాతం 45 వయసు పై బడిన వారిలో అధికంగా కనిపించేది. కానీ నేటి రోజుల్లో అలా కాదు 20 సంవత్సరాలు దాటిన యుక్త వయసులో వారిలో కూడా హార్ట్ అటాక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిక కారణం కూడా లేకపోలేదు. మారుతున్న కాలంతో పాటు మన జీవన విధానంలో మార్పులు రావడం, అలాగే మన ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు రావడంతో చిన్న వయసు నుంచే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు చాలామంది. ఇక నేటి రోజుల్లో వయసుతో పని లేకుండా ధూమపానం, మద్యపానం చేస్తున్న యువత సంఖ్య కూడా అధికంగానే ఉంది. దాంతో ఎన్నో ఆరోగ్య సమస్యలతో నేటి యువత కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో యుక్త వయసులో ఉన్నవారికి గుండె పోటు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. !

యుక్త వయసులో గుండె పోటు రావడానికి ప్రధాన కారణం.. ధూమపానం పొగాకు వినియోగం వంటివి చెప్పుకోవచ్చు. ధూమపానం అధికంగా సేవించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. పొగ సేవించడం వల్ల ఊపిరితిత్తులలోని గాలి రంద్రాలకు అంతరాయం ఏర్పడి గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల హార్ట్ అటాక్ వంటి సమస్యకు దారి తీసే అవకాశం ఉంది.

ఇక అధిక బరువు ఉన్న వారిలో కూడా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నేటి రోజుల్లో జంక్ ఫుడ్ కు అలవటు పడిన యువత చిన్నవయసులోనే అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు పెరిగి చివరికి గుండె పోటుకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక మానసిక ఒత్తిడికి గురయ్యే వారిలో కూడా గుండె సంబంధిత వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉందట. కాబట్టి వీలైనంతగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే అధిక రక్తపోటు, ఇంకా జన్యు పరమైన కారణాల వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు యుక్త వయసులో వారికి కూడా సంభావిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు

ఇవి కూడా చదవండి

నోటి దుర్వాసన ను ఇలా దూరం చేసుకోండీ!

వింటర్ లో చర్మం పొడిబారుతోందా.. ఇలా చేయండి !

ఆకలి వేయడం లేదా.. అయితే ఇలా చేయండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -