Saturday, May 18, 2024
- Advertisement -

డెమోక్రటిక్ అభ్యర్ధిగా నామినేషన్

- Advertisement -

హిల్లరీ క్లింటన్. అమెరికా మాజీ అధ్యక్షురాలి సతీమణి. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో డెమక్రటిక్ పార్టీ అభ్యర్ధి. ఇదే అమె తిరగరాసిన చరిత్ర. అమెరికా చరిత్రలో ఇంత వరకూ ఏ మహిళా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్న శాండర్స్ ను తోసిరాజని అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్నారు.

నామినేషన్ వేసేందుకు అవసరమైన 2383 మంది డెలిగేట్లను హిల్లరీ క్లింటన్ గెలుచుకున్నారు. ప్యూర్టో రికోలో జరిగిన ప్రాధమిక ఎన్నికల్లో హిల్లరీ భారీ విజయాన్ని సాధించారు. చివరి నిమిషంలో హిల్లరీకి సూపర్ డెలిగేట్ల ఓట్లు కూడా వచ్చాయని ఏజెన్సీ ప్రెస్ ప్రకటించింది. హిల్లరీకి 2383 డెలిగేట్లు రాగా శాండర్స్ కు 1591 డెలిగేట్లే వచ్చాయి. ఈ విషయాన్ని హిల్లరీ తన ట్విట్టర్ ద్వారా గాట్ ప్రైమరీస్ టు విన్ అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు శాండర్స్ మాత్రం జూలై నెలాఖరు వరకూ వేచిచూడాలని, ఎవరు డెమోక్రటిక్ అభ్యర్ధిగా పోటీలో ఉంటారో తేలుతుందని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -