Saturday, May 18, 2024
- Advertisement -

FLASH : నగరంలో మెట్రోరైల్ కొత్త టైమింగ్.. పాటించాలి తప్పదు..!

- Advertisement -

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెకండ్ వేవ్ ఉధృతి బీభత్సంగా ఉందని, మాస్కులు, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ మాత్రమే తప్పకుండా ఉంచుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్ల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. చివరి స్టేషన్ నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు ప్రకటించారు. అది గమ్యస్థానానికి 8.45 గంటలకు చేరుకుంటుందని తెలిపారు.

నేటి నుంచి ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని వివరించారు. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి యథావిధిగా మొదటి రైలు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు మాస్కు, శానిటైజర్లు తప్పక ఉపయోగించాలని సూచించారు. నిబంధనలు పాటించిన ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్..

చంద్రబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్!

మైనర్ ను గర్భవతిని చేసిన టిక్ టాక్ నటుడు భార్గవ్ అరెస్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -