Monday, April 29, 2024
- Advertisement -

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్..

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. దాంతో అక్కడ వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కాగా, ఈ మద్య కాలంలో ఢిల్లీలో ప్రతిరోజూ 25 వేల వరకు కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్ తగిలింది. కేజ్రీవాల్ అర్ధాంగి సునీతకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది.

భార్యకు కరోనా సోకడంతో కేజ్రీవాల్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.మరోవైపు కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో ఢిల్లీలో బెడ్లు దొరకడంలేదని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం అదనపు బెడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. 

ఇక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటం వల్ల.. పరీక్షలు చేయుంచుకోగా కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారందరూ టెస్టులు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు.

పవన్ కళ్యాణ్‏కు కరోనా నెగిటీవ్.. ఆనందంలో అభిమానులు!

సీఎం కేసీఆర్ గారూ.. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలి : పవన్ కళ్యాన్

చంద్రబాబు పై విజయసాయి సంచలన ట్విట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -