Sunday, May 19, 2024
- Advertisement -

రాజ‌ధాని ప్రాంతంలో ఐటీ దాడులు… టీడీపీ నేత‌ల్లో టెన్స‌న్‌

- Advertisement -

నాలుగు రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. తాజా ఐటీ అధికారుల దృష్టి ఏపీపై పడింది. ఆదాయపు పన్నుశాఖ అధికారులు తాజాగా ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ నేతలు, మంత్రుల ఇళ్లను టార్గెట్‌ చేసినట్లు సమాచారం. పోలీసుల బందోబస్తుతో గుంటూరు, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

గురువారం నెల్లూరులో టీడీపీ నేత బీదన మస్తాన్‌రావు కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంత‌రం పలువురు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఐటీ బృందాలు విజయవాడకు చేరుకోక మునుపే పోలీసు ఉన్నతాధికారులకు కేంద్ర హోమ్ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం. ఐటీ అధికారులకు సహకరించాలని, ఈ విషయం ఉన్నతాధికారుల మధ్య మాత్రమే ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఏపీ పురపాలక శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం వేకువజాము నుంచే పలువురు నివాసాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని, నారాయణ విద్యా సంస్థల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది.

రేవంత్‌ రెడ్డి ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ నగదును ఏపీ నేతలే అందించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టిసీమ అవినీతి సొమ్ముతోనే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇరిగేషన్ కాంట్రాక్టుల్లో భారీగా ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మంత్రి ద్వారానే డబ్బును తెలంగాణకు పంపినట్లు ప్రచారం కూడా జరిగింది.

నెల్లూరులో బీద మస్తాన్‌రావు ఆస్తులపై జరిగిన దాడుల నేపథ్యంలో టీడీపీ నేతలు హడలిపోతున్నారు. రాజధానిలో వందలాది ఎకరాలను కొనగోలు చేసిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -