Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీ లో ‘నల్ల’ ధనం

- Advertisement -

సీఆర్ డీఏ పరిధిలో ఇటీవల దాదాపు 40వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. కృష్ణా – గుంటూరు జిల్లా పరిధిలో దాదాపు 1000 మంది భారీ స్థాయిలో బ్లాక్ మనీ కలిగి ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. కానీ కేవలం 40 మంది మాత్రమే ఇటీవల నల్లధనం వెల్లడించారు. ఇలా భారీగా నల్లధనం పోగేసిన వారి జాబితాలో ఏపీకి చెందిన ఒక కీలక మంత్రి కూడా ఉన్నారని చెబుతున్నారు.

ఆయన సీఎంకు అత్యంత సన్నిహితుడని కూడా భావిస్తున్నారు.  ఇటీవల ఆ మంత్రి అడ్డగోలుగా సంపాదించిన విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ గుర్తించినట్టు పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. సీఆర్ డీఏలో జరిగిన లావాదేవీల్లో అత్యధికం బ్లాక్ మనీయే ఉంటుందన్నది అందరికీ తెలిసిన సత్యం.  

దీంతో రాజధాని ఏరియాలో భారీగా రియల్ ఎస్టేట్ చేస్తున్న ఆ మంత్రిపై ఐటీ దాడికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు మోదుగుల – సత్యప్రభ ఇళ్లపై దాడి చేసిన ఐటీ అధికారులు భారీగా నల్లధనం స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 15 తర్వాత ఆపరేషన్ సీఆర్ డీఏ ప్రారంభించేందుకు ఐటీ శాఖ సిద్ధమవుతోందని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -