Sunday, May 19, 2024
- Advertisement -

రెండు ల‌క్షకంటె ఎక్కువ స్వీక‌రిస్తే అంతే మొత్తంలో జ‌రిమానా

- Advertisement -
Income Tax department warns against cash dealings of Rs 2 lakh, seeks tip-off

భారాగా న‌గుదు లావాదేవీలు నిర్వ‌హించే ఖాతాదారుల‌కు ఇక‌నుంచి చుక్క‌లు క‌నిపించ‌నున్నాయి.భారీ మొత్తంలో న‌గ‌దు లావావేవీలు నిర్వ‌హిస్తే అంతే మొత్తంలో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆదాయం పన్ను శాఖ హెచ్చరించింది.

రూ.2 లక్షలు లేదా అంతకంటే అధిక విలువైన నగదు లావాదేవీ జరిపినట్లయితే, ఆ నగదు స్వీకరించిన వారు అంతే మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
దేశంలో న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టేందుకు 2017–18 కేంద్ర బడ్జెట్‌లో రూ.3 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీల నిర్వహణను నిషేధించే ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, ఆ తర్వాత దాన్ని రూ.2 లక్షలు అంతకుమించిన లావాదేవీలకు తగ్గించి ఆర్థిక బిల్లులో సవరణ చేర్చారు.

{loadmodule mod_custom,GA1}

ఈబిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ఆదాయపన్ను చట్టంలో సెక్షన్‌ 269ఎస్‌టిని చేర్చారు. దీని కింద ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకుమించిన నగదు లావాదేవీలు నిషేధం. ఒక అంశానికి సంబంధించి ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం రూ.2 లక్షలు నగదు రూపంలో చెల్లించడం, తీసుకోవడం చట్ట విరుద్ధం.
అయితే కొన్నింటికి మిన‌హాయంపు ఇచ్చింది. ప్రభుత్వానికి, బ్యాంకింగ్ సంస్థకు, పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్, సహకార బ్యాంక్‌లకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు.ఇక నుంచి రెండు ల‌క్ష‌ల‌కంటె ఎక్కువ న‌గ‌దా లావాదేవీలు నిర్వ‌హిస్తే ఇక మీకు బాదుడే.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -