Monday, May 13, 2024
- Advertisement -

బాలీవుడ్ కింగ్‌ఖాన్‌కు ఐటీ షాక్‌

- Advertisement -

ఆలిభాగ్ ఫామ్‌హౌస్ సీజ్‌

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్‌కు ఆదాయ‌పు ప‌న్ను అధికారులు పెద్ద షాకు ఇచ్చారు. తాను ఎంతో ఇష్ట‌పడి కష్టపడి కట్టుకున్న ఆలిభాగ్ ఫార్మ్ హౌస్‌ను సీజ్ చేశారు. ఈ నిర్మాణం చట్టవిరుద్ధం అని నిషేధిత బినామి ఆస్తుల లవాదేవేల చట్టం (పీబీపీటీ) ప్రకారం గ‌తేడాది డిసెంబర్‌లోనే ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దీనికి షారుఖ్ స్పందించక‌పోవ‌డంతో చ‌ర్య‌లు తీసుకున్నారు. సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో షారుక్‌ఖాన్ ఇష్ట‌పడి ఆలిభాగ్ ఫామ్‌హౌస్‌ కట్టుకున్నాడు. దీని విలువ దాదాపు రూ.50-70 కోట్ల దాకా ఉంటుంద‌ని అంచ‌నా. అతిపెద్ద స్విమ్మింగ్‌పూల్, పెద్ద హెలీప్యాడ్ ఈ ఫామ్‌హౌస్‌లో ఉన్నాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అండ్ కోల్‌క‌త్తా నైట్‌రైడర్స్ సీఈఓగా షారుక్‌ ఈమెయిల్‌కు ఈ నోటీసులు పంపించారు.

వ్యవసాయ భూమిగా కొనుగోలు చేశాన‌ని చెప్పిన షారూక్‌ తన వ్యక్తిగత అవసరాలు, విలాసాలకు, పార్టీలకు వాడుతున్నాడని ఆదాయ‌పు ప‌న్ను అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. షారుక్‌ఖాన్ తన పుట్టినరోజులతో సహా అని వేడుకలను బాలీవుడ్ మిత్రులతో కలిసి ఇందులోనే సెలెబ్రేట్ చేసుకుంటాడు. దీంతో ఆయ‌న తెలిపిన వాటికి విరుద్ధంగా వినియోగించుకుంటుండ‌డంతో ఐటీ స్పందించి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇది బినామీ ఆస్తుల చట్టం కిందకు కేసు రావడంతో షారుక్ పోరాడాల్సిందే. నోటీసులు అందుకున్న 45 రోజుల్లో షారుక్ బదులు ఇవ్వాలి. హైకోర్టుకు వెళ్ల‌డానికి 60 రోజుల సమయం కూడా ఉంటుంది. ఈ ఫామ్‌హౌస్‌ను షారూక్ తన పేరు మీద కాకుండా నకిలీ సంస్థ డేజా వూ పేరుతో కొనుగోలు చేశాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -