Monday, May 20, 2024
- Advertisement -

దేశంలో పెరిగిపోతున్న వయో పెద్దలు

- Advertisement -

అన్నింటా చైనా కంటే వెనుక ఉండే మనం ఓ విషయంలో మాత్రం వారికంటే ముందున్నాం. అదేమిటనుకుంటున్నారా. ఇంకేముంది. ముసలివాళ్ల జనాభాలో. ఇంతకు ముందు చైనాలో ముసలి వారు ఎక్కువగా ఉండే వారు.

ఇప్పుడు ఆ ఘనత భారత్ కు దక్కింది. దేశంలో 60 సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోందని కేంద్రం విడుదల చేసిన ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. 2001లో 7.66 కోట్లు ఉన్న పెద్ద వారు 2011 వచ్చే సరికి 10.38 కోట్లకు పెరిగిపోయారు. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు.

అయితే గొప్ప విషయం ఏమిటంటే వీరంతా వారి కాళ్లపై వారు నిలబడి బతకడమే. అది భారత్ అంటే. గ్రామాల్లో ఆ పని, ఈ పని చేస్తూ స్వతంత్రంగా బతుకుతున్న వారు 66 శాతం మంది ఉన్నారు. వీరిలో మహిళలైతే 28 శాతం ఉండడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -