Friday, May 17, 2024
- Advertisement -

రోహిత్ ‘డబుల్’ ధమాకా… రెండో వ‌న్డేలో టీమిండియా ఘ‌న‌విజ‌యం..

- Advertisement -

మొహాలీలో జరిగిన భార‌త్, శ్రీలంక రెండో వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా 141 ప‌రుగుల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. సెంచ‌రీ బాది.. మాథ్యూస్ చేసిన ఒంట‌రి పోరాటం వృథా అయిపోయింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్.. శ్రీలంక ముందు 393 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్య ఛేద‌న‌లో క్రీజులోకి వ‌చ్చిన‌ శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో గుణ‌తిల‌క 16, త‌రంగ 7, తిరిమ‌న్నే 21, డిక్ వెల్లా 22 , అసెలా గుణ‌ర‌త్నే 34, పెరెరా 5, ప‌తిరానా 2, ధ‌నంజ‌య 11, మాథ్యూస్ 111 (నాటౌట్), ల‌క్మ‌ల్ 11 (నాటౌట్) ప‌రుగులు చేశారు. దీంతో 50 ఓవ‌ర్ల‌లో శ్రీలంక 251 పరుగులు చేసింది.

తొలి వన్డే గెలుపుతో విర్రవీగిన శ్రీలంక బౌలర్లని కనికరం లేకుండా కెప్టెన్ రోహిత్ శర్మ (208 నాటౌట్: 153 బంతుల్లో 13×4, 12×6) డబుల్ సెంచరీతో తొలుత ఉతికారేయగా.. అనంతరం బౌలర్లు ఆ జట్టు బ్యాట్స్‌మెన్ల పనిపట్టారు.దీంతో మొహాలి వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో 141 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్ మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసి.. సిరీస్‌ ఆశలు నిలుపుకుంది.

టీమిండియా బౌల‌ర్ల‌లో చాహెల్ 3 వికెట్లు తీయ‌గా, బుమ్రా 2 వికెట్లు తీశాడు. పాండ్యా, వాషింగ్ట‌న్ సుంద‌ర్, హార్ధిక్ పాండ్యాల‌కు చెరో వికెట్ ల‌భించాయి. మొద‌టి వ‌న్డేలో శ్రీలంక గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ వ‌న్డే సిరీస్‌లో భార‌త్, శ్రీలంక‌ 1-1 తో స‌మంగా ఉన్నాయి. దీంతో వ‌చ్చే ఆదివారం జర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్ పై ఆసక్తి నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -