Sunday, May 19, 2024
- Advertisement -

250 మహిళల తలలు నరికి హత్య

- Advertisement -

ఐసిస్ పైశాచికంగా మరోసారి బయటపడింది. సెక్స్ బానిసలుగా ఉండేందుకు వ్యతిరేకించిన 250 మంది ఇరాక్ మహిళలను ఐసిసి తలలు నరికి అతి క్రూరంగా చంపేసింది. ఇరాక్ లోని మౌసోలిలో అ దారుణానికి తెగబడ్డారు ఐసిస్ తీవ్రవాదులు. ఈ పట్టణం ఇరాక్ లో రెండో పెద్ద పట్టణం. దీన్ని 2014 సంవత్సరంలో ఐసిస్ తన ఆధీనంలోకి తీసుకుంది.

అప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్న ఐసిస్ తీవ్రవాదులు తాత్కాలిక వివాహం పేరుతో అమ్మాయిలను సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారు. అయితే ఇటీవల కొందరు మహిళలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ మహిళల్ని వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే తలలు నరికి హత్య చేసినట్లు కుర్దిష్ డెమక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి మమూజినీ విలేకరులకు తెలిపారు. ఐసిస్ స్వాధీనంలో ఉన్న చోట మానవ హక్కుల ఉల్లంఘన ఎదేచ్చగా జరుగుతోందని పేట్రియాటిక్ యూనియన్ ఆఫ్ కుర్దిస్తాన్ పార్టీకి చెందిన నేత ఘయాస్ సర్చీ అన్నారు.

వారున్న చోట మహిళలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కును కూడా కోల్పోయారని ఆయన అన్నారు. రెండేళ్ల క్రితం 500 యాజిది మహిళల్ని ఐసిస్ కు సెక్స్ వర్కర్లుగా అప్పగించారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో మరో ఐదు వందల మంది మహిళల్ని అపహరించుకుపోయారు. మరోవైపు సౌదీ అరేబియాలో జరుగుతున్న అరబ్ దేశాల ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ఐసిస్ పై పోరుకు ప్రపంచదేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఐసిస్ సిరియా, ఇరాక్ లో కొన్ని ప్రాంతాలను తన ఆధీనంలో ఉంచుకుందని అన్నారు. దీనిపై పోరుకు గల్ఫ్ దేశాలు కలిసికట్టుగా కదలాలని పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -